న్యూఢిల్లీ: టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్నెస్ ఆందోళన కల్గిస్తున్నది. వెన్నెముక గాయం నుంచి సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే జట్టులోకి వచ్చిన అయ్యర్..మరోమారు ఫిట్‌నెస్‌లేమితో దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో తుది జట్టుకు ఎంపిక కాలేకపోయిన అయ్యర్ ఫిట్‌నెస్‌పై గురువారం స్పష్టత వచ్చే అవకాశముంది.