అనీశ్కు కాంస్యం.. ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్
ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లో యువ షూటర్ అనీశ్ భన్వాల కాంస్య పతకంతో మెరిశాడు.
న్యూఢిల్లీ : ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లో యువ షూటర్ అనీశ్ భన్వాల కాంస్య పతకంతో మెరిశాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో అనీశ్ 23 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, యోషియోకా దాయి(31, జపాన్), చిర్యుకిన్ నికిత(28, కజకిస్థాన్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
ఇదే విభాగంలో ఆదర్శ్సింగ్(11) ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు అనీశ్(574), ఆదర్శ్సింగ్(573) పాయింట్లతో ఫైనల్ పోరుకు అర్హత సాధించడగా, నాలుగో సిరీస్ తర్వాత ఆదర్శ్ ఎలిమినేట్ అయ్యాడు. మరోవైపు 50మీటర్ల జూనియర్ రైఫిల్ ఈవెంట్లో అద్రియాన్ కర్మాకర్, రోహిత్ కన్యాన్, హేమంత్ బర్మన్తో కూడిన త్రయం ఫైనల్లో నిలిచింది. పురుషుల జూనియర్ 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ కేటగిరీలో సూరజ్ శర్మ(23), ముకేశ్ నేలవల్లి(19) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ఓవరాల్గా భారత్ ప్రస్తుతం 41స్వర్ణాలు, 19 రజతాలు, 15 కాంస్య పతకాలతో కొనసాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

