ఐదో తరగతి విద్యార్థుల గొడవ
ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు చిన్నారులు గొడవపడటంతో ఓ చిన్నారికి తల పగిలిన ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. జియాగూడాలోని జోషిగల్లీలో క్రిష్ణవేణి టాలెంట్ పాఠశాలలో దుర్గానగర్‌కు చెందిన లక్ష్మీకాంత్చారి కుమారుడు ప్రణయ్చారి ఐదో తరగతి చదువుతున్నాడు.
- ఓ విద్యార్థి తలకు గాయం, తల్లిదండ్రుల ఆందోళన
కార్వాన్, ఫిబ్రవరి11: ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు చిన్నారులు గొడవపడటంతో ఓ చిన్నారికి తల పగిలిన ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. జియాగూడాలోని జోషిగల్లీలో క్రిష్ణవేణి టాలెంట్ పాఠశాలలో దుర్గానగర్‌కు చెందిన లక్ష్మీకాంత్చారి కుమారుడు ప్రణయ్చారి ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రయణ్చారిపై తన తోటి విద్యార్థి దాడి చేయడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న ప్రణయ్ తల్లిదండ్రులు వెంటనే తమ కుమారుడిని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. పాఠశాలలో చిన్నారులపై దృష్టి పెట్టాల్సిన పాఠశాల యాజమాన్యం విద్యార్థులు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో సౌకర్యాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు గుంజే యాజమాన్యం తమ విద్యార్థులపై శ్రద్ధ వహించకపోవడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అటు విద్యాశాఖ అధికారులు గాని, ఇటు పోలీస్‌శాఖ గాని ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

