IPL 2025 : పద్దెనిమిదో ఎడిషన్ తమ తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో చెలరేగగా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. అయ్యర్ మెరుపులతో డీలా పడిన గుజరాత్ టైటన్స్ బౌలర్లను యువ చిచ్చరపిడుగు శశాంక్ సింగ్(44 నాటౌట్) ఓ ఆట ఆడుకున్నాడు. రబడ, సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 20వ ఓవర్లో ఐదు ఫోర్లతో 23 రన్స్ పిండుకున్న శశాంక్ గుజరాత్‌కు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.
టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ కొండంత స్కోర్ కొట్టింది. ఈ సీజన్లో పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్(97 నాటౌట్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి పోటీ అన్నట్టు శశాంక్ సింగ్ (44 నాటౌట్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) గుజరాత్ బౌలింగ్ దళంపై దాడికి దిగాడు. దాంతో, అహ్మదాబాద్ స్టేడియం బౌండరీల మోతతో దద్ధరిల్లింది. వీళ్లిద్దరూ 28 బంతుల్లోనే 81 పరుగులు జోడించి పంజాబ్ స్కోర్ 240 దాటించారు.
INNINGS BREAK!
Shashank Singh’s late cameo and Shreyas Iyer’s 97* (42) powers #PBKS to 243/5 💪
Can #GT pull off this chase?
Scorecard ▶ https://t.co/PYWUriwkKq#GTvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/tVmgoBVH4j
— IndianPremierLeague (@IPL) March 25, 2025
తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న యువ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా(47) అదిరే ఆరంభమిచ్చాడు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన అతడు. సిరాజ్‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికాడు. అయితే.. రబడ తన తొలి ఓవర్లోనే డేంజరస్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(5)ను వెనక్కి పంపాడు. సిమ్రన్ ఔటయ్యాక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97) జతగా ప్రియాన్ష్ రెచ్చిపోయాడు. అర్షద్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదేసి 21 పరుగులు పిండుకున్నాడు. అర్ధ శతకానికి చేరువైన అతడు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్(16), గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిరాశపరిచారు.
𝙄.𝘾.𝙔.𝙈.𝙄
Enjoy glimpses of a Shreyas Iyer Special in Ahmedabad as he remained unbeaten on 97*(42) 👏
Updates ▶ https://t.co/PYWUriwSzY#TATAIPL | #GTvPBKS | @PunjabKingsIPL | @ShreyasIyer15 pic.twitter.com/6Iez7wJ2r6
— IndianPremierLeague (@IPL) March 25, 2025
అయితే.. అయ్యర్ మాత్రం జోరు తగ్గించలేదు. శశాంక్ సింగ్ రాకతో పంజబ్ స్కోర్ వేగం అందుకుంది. ప్రసిధ్ కృష్ణ వేసిన 17వ ఓవర్లో అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. లాంగాన్‌లో సిక్సర్ బాదిన అతడు.. ఆ తర్వాతి మూడు బంతుల్ని 4, 6, 6 గా మలిచి 90కి చేరువయ్యాడు. రబడ బౌలింగ్‌లో బౌండరీ సాధించిన అయ్యర్.. సెంచరీ కోసం స్ట్రయిక్ తీసుకోలేదు. 20వ ఓవర్లో రెచ్చిపోయిన శశాంక్ 4 ఫోర్లతో 23 పరుగులు రాబట్టగా.. గుజరాత్ ముందు 244 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్.