మధిర, మార్చి 25 : సువిధ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అమెరికాకు అనుబంధంగా ట్రస్ట్ సువిధ వికాస్ ఆధ్వర్యంలో చింతకాని మండలం నామవరం ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ, ట్రస్ట్ బాధ్యులు అమరనేని మన్మధరావు చేతుల మీదుగా పదిమంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ మాట్లాడుతూ.. దాతలు ఇస్తున్న సహకారంతో విద్యార్థులు అందరు మంచి క్రమశిక్షణ కలిగి ఉండి బాగా చదువుకోవాలన్నారు. జిల్లాలోనే నామవరం గ్రామ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలాన్నారు.
ఈ సంవత్సరం పదో తరగతి విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించాలని కోరారు. ట్రస్ట్ ప్రధాన బాధ్యులు మన్మధరావు మాట్లాడుతూ… బీద విద్యార్థుల చదువులు సాఫీగా కొనసాగడానికి సువిధ ట్రస్ట్ ఉపకార వేతనాలు, ల్యాప్టాప్లు, బీద మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి వీరపనేని శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు వెంపసాని వెంకటి, అమ్మా ఆదర్శ పాఠశాల చైర్మన్ బొల్లికొండ మంగమ్మ, ఇన్చార్జి హెచ్ఎం అనిత, ఉపాద్యాయులు గండేపల్లి శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరరావు, సురేశ్, నాగమణి, హసీనా, సమ్మయ్య పాల్గొన్నారు.