Irani Cup 2024 : దులీప్ ట్రోఫీలో ఎట్టకేలకు ఓ అర్థ శతకంతో మెరిసిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) టెస్టు జట్టులోకి రావడం మరింత ఆలస్యం కానుంది. చెపాక్‌లో బంగ్లాదేశ్‌పై భారీ విజయం అనంతరం బీసీసీఐ రెండో టెస్టుకు కూడా అదే స్క్వాడ్‌ను ప్రకటించింది. దాంతో, పునరామనంపై ఆశలు పెట్టుకున్న అయ్యర్ మరోమారు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా డీ తరఫున ఆడిన అతడు అక్టోబర్ 1న జరుగబోయే ఇరానీ కప్ (Irani Cup 2024)లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నాడు.
మోకాలి గాయం నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్ కూడా ఇరానీ కప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటున్నాడు. రంజీలో ముంబైని విజేతగా నిలిపిన వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే (Ajinkya Rahane) ఈ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడని సమాచారం.
RAHANE TO LEAD MUMBAI IN IRANI CUP…..!!!! 🏆
– Shreyas Iyer, Shardul Thakur are set to play for Mumbai. [Vijay Tagore from Cricbuzz] pic.twitter.com/5rJvl6szPH
— Johns. (@CricCrazyJohns) September 23, 2024
అక్టోబర్ 1 నుంచి 5 మధ్య జరిగే ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా(Rest Of India)తో రహానే బృందం తలపడనుంది. లక్నోలోని ఏక్నా స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అయితే.. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) ఇప్పటికైతే అధికారికంగా స్క్వాడ్‌ను ప్రకటించలేదు. టోర్నీకి ఇంకా ఏడు రోజులే ఉండడంతో ఈ వారంలో ఎంసీఏ ముంబై స్క్వాడ్‌ను ఎంపిక చేసే అవకాశముంది.
రంజీల్లో ఆడేందుకు సాకులు చెప్పి సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లపై ఫోకస్ పెట్టాడు. దులీప్ ట్రోఫీలో డీ జట్టు సారథిగా తొలి రౌండ్లో డకౌట్లతో నిరాశపరిచాడు. అయితే.. రెండో రౌండ్లో తొలి ఇన్నింగ్స్‌లో సున్నాకే ఔటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో యాభైతో మెరిశాడు.
అయ్యర్, రాహుల్
టెస్టుల్లో పునరాగమనం కోసం వేచి చూస్తున్న అయ్యర్‌కు ఇరానీ కప్ అతడికి సువర్ణావకాశం కానుంది. ఎందుకంటే.. బంగ్లాదేశ్‌పై తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (KL Rahul) విఫలమయ్యాడు. కాన్పూర్ టెస్టులోనూ రాహుల్ తడబడితే.. సెలెక్టర్లు అయ్యర్ పేరును పరిశీలించే అవకాశముంది.