Sathyam Sundaram | కోలీవుడ్ స్టార్ యాక్టర్లు కార్తీ (Karthi), అరవింద్ స్వామి (Aravindha Swamy) లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న తమిళ చిత్రం మెయ్యళగన్ (Meiyazhagan). 96 ఫేం ప్రేమ్ కుమార్ సీ (Prem Kumar C) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగులో ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 28న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్ చేశారు.
కార్తీ, అరవింద్‌స్వామి మధ్య అనుబంధం నేపథ్యంలో భావోద్వేగపూరిత సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఇద్దరు కజిన్స్ కథతో ఫన్ ఎలిమెంట్స్‌తో సరదా సన్నివేశాలతో సీరియస్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.
ఈ చిత్రాన్ని హోం బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్పై సూర్య- జ్యోతిక రాజశేఖర్ కర్పూరసుందరపాడ్యన్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజ్ కిరణ్, శ్రీదివ్య, స్వాతి, దేవదర్శిణి, జయప్రకాశ్, శ్రీరంజిని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 96 ఫేం గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో సెప్టెంబర్ 27న విడుదలవుతోంది.
సత్యం సుందరం ట్రైలర్..
Jani Master | జానీమాస్టర్‌ను కస్టడీకి కోరిన నార్సింగి పోలీసులు..!
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి