టీ20 ప్రపంచకప్ రోజురోజుకూ దగ్గరపడుతోంది. దీంతో అన్ని జట్ల కూర్పులపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. భారత అభిమానులు కూడా ఆడే 11 మందిలో ఎవరికి చోటు దక్కాలనే దానిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రిషభ్ పంత్, దినేష్ కార్తీక్లలో ఒకరికే తుదిజట్టులో ఛాన్స్ ఇవ్వాలంటే ఎవరిని తీసుకోవాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కుండ బద్దలు కొట్టేశాడు.
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టీ20 జరుగుతున్న నేపథ్యంలో మాట్లాడిన జాఫర్.. అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ ఆడితే చూడాలని అనుకుంటున్నట్లు చెప్పేశాడు. అలాగే అసలు పంత్ ఆడతాడా? లేదా? అనే విషయంలో టీమ్ మేనేజ్మెంట్ ఒక స్పష్టతకు రావాలని సూచించాడు. టెస్టులు, వన్డేల్లో పంత్ అద్భుతమైన ఆటగాడని, కానీ పొట్టి ఫార్మాట్లో పంత్ పెద్దగా రాణించలేదని గుర్తుచేశాడు. దానికి తోడు అతనికి సరైన స్థానం ఏదో కూడా జట్టులో స్పష్టత లేదని, ఇలాంటి సమయంలో అతన్ని పక్కనపెట్టేయడమే మంచిదని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
My team for tomorrow:
1. KL
2. Rohit
3. VK
4. SKY
5. Hardik
6. DK (wk)
7. Axar
8. Harshal
9. Bhuvi
10. Bumrah
11. ChahalWhat's yours? #INDvAUS
— Wasim Jaffer (@WasimJaffer14) September 19, 2022