NZ vs AUS : వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియా(Australia) పొట్టి సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసింది. ఇప్పటికే రెండు విజయాలతో పొట్టి సిరీస్(T20 Series) కైవసం చేసుకున్న ఆసీస్ నామమాత్రమైన మూడో మ్యాచ్‌లోనూ గెలిచింది. డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో బ్యాక్క్యాప్స్ను ఓడించింది. మిచెల్ మార్ష్ సేన నిశించిన 119 పరుగుల ఛేదనలో కివీస్ 98 పరుగులకే పరిమితమైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన కంగారు జట్టు 4 వికెట్ల నష్టానికి 118 రన్స్ కొట్టింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(33), మాథ్యూ షార్ట్(27), గ్లెన్ మాక్స్వెల్(20) పరుగులతో రాణించారు. అనంతరం స్వల్ప ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్(13), విల్ యంగ్(14) లు శుభారంభమిచ్చారు.
Australia clinch victory in the third T20I, wrapping up a commanding 3-0 sweep in the #NZvAUS series 💪
Scorecard 📝 https://t.co/5zaMvjHjvr pic.twitter.com/6DzABvuHPo
— ICC (@ICC) February 25, 2024
ఆ తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిఫ్స్(40 నాటౌట్), మార్క్ చాప్మన్(12 నాటౌట్) ధనాధన్ ఆడినా ఫలితం లేకపోయింది. జంపా, షార్ట్, జాన్సన్‌లు తలా ఒక వికెట్ తీయడంతో నిర్ణీత ఓవర్లలో బ్లాక్‌క్యాప్స్ 93 రన్స్ మాత్రమే చేసింది. దాంతో, మార్ష్ సేన 3-0తో పొట్టి సిరీస్‌ను చేజిక్కించుకుంది. మాథ్యూ షార్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవ్వగా.. మిచెల్ మార్ష్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.