న్యూఢిల్లీ: ఒక వ్యక్తిని మహిళ దారుణంగా కొట్టింది. బ్యాంగిల్స్ షాపు నుంచి బయటకు అతడ్ని తోసింది. ఆ తర్వాత చేతికి అందిన గాజుల దండలతో చితకబాదింది. (Woman Thrashes Man) కుస్తీపోటీలను తలపించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గాజుల షాపు వద్ద ఒక మహిళ, ఒక వ్యక్తి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆమె, అతడ్ని ఆ షాపు నుంచి బయటకు తోసింది. ఆపై ఆ వ్యక్తిపై తిరుగబడింది. అతడ్ని కిందకు నెట్టడంతోపాటు కొట్టింది. అంతటితో ఆగక అక్కడున్న బ్యాంగిల్స్ దండతో బాదింది.
కాగా, ఆ వ్యక్తి కూడా ఆమెను ప్రతిఘటించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు ఆ మహిళ తిరిగి షాపులోకి వెళ్తుంది. ఆ సమయంలో అక్కడున్న వారు ఈ ఫైట్ చూసి కేరింతలు కొట్టారు. ఈలలు, చప్పట్లతో హంగామా చేశారు. ఈ ఫైటింగ్ సందర్భంగా హర్యానా సాంగ్ ప్లే కావడంతో హర్యానాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
WWE kinda kalesh b/w a Couple in Public
pic.twitter.com/xLs6Kq7p5d— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2024