Shikhar Dhawan | ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ (World Cup 2023) కోసం టీంఇండియా జట్టును బీసీసీఐ (BCCI) ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా గత మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజాలకు జట్టులో చోటు కల్పించారు. అయితే ఈ జట్టులో టీంఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)కు చోటు దక్కలేదు. పదేళ్లలో తొలిసారి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ధావన్ దూరమయ్యాడు. దీంతో ధావన్‌ను మినహాయించడం అందరినీ నిరాశపరిచింది. అయితే జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ ధావన్ తన క్రికెట్ జీవితం పట్ల సాకూల దృక్పథంతో ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్‌లో టీంఇండియా జట్టు గెలవాలని కోరుకుంటూ.. ఉజ్జయిని (Ujjaini)లోని మహాకాళేశ్వర్ ఆలయంలో (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ధావన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాను. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో టీంఇండియా విజయం సాధించాలని ప్రార్థించాను. భారత్ ప్రపంచకప్ గెలవాలన్నదే అందరి కోరిక, నేను కూడా అదే కోరిక కోరాను’ అని తెలిపాడు.
Shikhar Dhawan & Akshay Kumar at Mahakaleshwar Temple in Ujjain.pic.twitter.com/5vk5CTahAa
— Johns. (@CricCrazyJohns) September 9, 2023
కాగా, ఈ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక టాప్ ఆర్డర్లో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. బౌలర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, షమీ, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా ఆ బృందంలో చోటు కల్పించారు.
Also Read..
Morocco Earthquake | మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం.. 632కి పెరిగిన మృతుల సంఖ్య
Sanju Samson | కేఎల్ రాహుల్ రాకతో.. ఆసియా కప్‌నుంచి సంజూ శాంసన్ ఔట్
African Union | జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం