Morocco Earthquake | మొరాకోను కుదిపేసిన భారీ భూకంపం.. 632కి పెరిగిన మృతుల సంఖ్య
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco) ను శక్తివంతమైన భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ భూకంపం ధాటికి 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco) ను శక్తివంతమైన భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ భూకంపం ధాటికి 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ 632 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి వెల్లడించారు. సుమారు 329 మంది గాయాలపాలైనట్లు చెప్పారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 51 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. ఆల్ హౌజ్, మర్రకేష్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Also Read..
Morocco Earthquake | మొరాకోకు సాధ్యమైన సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉంది : ప్రధాని మోదీ
African Union | జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Marrakesh
- Morocco
- USGS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

