Shikhar Dhawan | కుమారుడి పుట్టినరోజు సందర్భంగా భారత ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఎమోషనల్ పోస్ట్ (emotional note) చేశాడు. ‘నిన్ను చూసి ఏడాది అవుతోంది’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు ఇటీవలే తన కుమారుడితో వీడియో కాల్ మాట్లాడిన ఫొటోను ఇన్ష్టా వేదికగా షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. కుమారుడితో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలా తనను బ్లాక్ చేసినట్లు ఆవేదనకు గురయ్యాడు.
‘నేను నిన్ను ప్రత్యక్షంగా చూసి ఏడాది అయిపోయింది. దాదాపు మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా అన్ని విధాలుగా నన్ను బ్లా్క్ చేసేశారు. నాకు నిన్ను పూర్తిగా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను నీతో నేరుగా మాట్లాడలేకపోయినప్పటికీ.. టెలీపతితో ఎప్పటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. ఈ పాపా ఎప్పుడూ నిన్ను మిస్ అవుతాడు. ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఉన్నతంగా ఎదగాలి. గొప్పగా రాణించాలి. దేవుడి దయ వల్ల మళ్లీ మనం కలుస్తామని ఆశిస్తున్నా. ఆ సమయం కోసం చిరునవ్వుతో ఎదురు చూస్తూనే ఉంటా. ధైర్యంగా, సంతోషంగా ఉండు. హ్యాపీ బర్త్డే జొరావర్.. లవ్ యూ’ అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కాగా, తాము విడిపోతున్నట్లు ఆయేషా ముఖర్జీ, శిఖర్ ధావన్(Shikhar Dhawan) దంపతులు రెండేళ్ల క్రితం ప్రకటించారు. ఈ క్రమంలోనే తన భార్య మానసిక వేదనకు గురిచేసినట్లు ఆరోపిస్తూ.. ధావన్ ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధావన్ పిటిషన్పై విచారణ జరిపిన పాటియాలా ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఒక్కగానొక్క కొడుకు జొరావర్ను తల్లి కస్టడీకి అప్పగించింది. దీంతో కుమారుడిని తీసుకునే ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది.
Also Read..
CM Jagan | మంత్రి రోజాకు బ్యాటింగ్ నేర్పించిన సీఎం జగన్.. వీడియో
Gulmarg | గుల్మార్గ్పై మంచు దుప్పటి.. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులు
Ram Charan | క్లింకారతో చరణ్.. బెస్ట్ డాడ్ అంటూ ఫొటో షేర్ చేసిన ఉపాసన