Gulmarg | భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Gulmarg) పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది (Snow blanket). రోడ్లు, ఇళ్లను మంచు కప్పేసింది.
పర్యాటకులు ఈ మంచులో ఎంజాయ్ చేస్తున్నారు (tourists enjoy the weather). అందమైన కశ్మీర్లో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున ప్రజలు కొండ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి.
#WATCH | Snow blanket covers Jammu & Kashmir’s Gulmarg; tourists enjoy the weather. pic.twitter.com/cFkaPowHXF
— ANI (@ANI) December 26, 2023
Also Read..
Ram Charan | క్లింకారతో చరణ్.. బెస్ట్ డాడ్ అంటూ ఫొటో షేర్ చేసిన ఉపాసన
MeGa Christmas Celebrations | మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబురాలు…ఫోటో గ్యాలరీ
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం