Ram Charan | మెగా ఇంట క్రిస్మస్ (Christmas) సంబరాలు ఘనంగా జరిగాయి. మెగా, అల్లు కుటుంబంలోని స్టార్ నటులంతా ఒకచోట చేరి సందడి చేశారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులతోపాటు, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి, కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్‌తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక చరణ్ (Ram Charan) దంపతులు తమ ముద్దుల తనయ, మెగా ప్రిన్సెస్ క్లింకార (klin kaara)ను కూడా ఈ సెలబ్రేషన్స్‌కు తీసుకొచ్చారు.
వేడుకల్లో భాగంగా చరణ్ తన కూతురితో దిగిన ఫొటోను ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘బెస్ట్ డాడ్’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Merry Christmas ❤️❤️❤️@AlwaysRamCharan Best dad 🤗 pic.twitter.com/fKnkZIVQ6z
— Upasana Konidela (@upasanakonidela) December 26, 2023
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
Coronavirus | 24 గంటల్లో 116 కొత్త కేసులు.. ముగ్గురు మృతి