Coronavirus | 24 గంటల్లో 116 కొత్త కేసులు.. ముగ్గురు మృతి
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. అయితే, గత రెండు, మూడు రోజులతో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 116 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది.
ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో మహమ్మారి కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,33,337కి ఎగబాకింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,72,153 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు ప్రస్తుతం దేశంలో కేసులు పెరుగుదలకు కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జేఎన్.1 (JN.1) కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు ఈ తరహా కేసులు 63 నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
Also Read..
Chiranjeevi | సీఎం రేవంత్‌తో చిరంజీవి భేటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

