Shikha Pandey : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ మెగా వేలంలో సీనియర్లు కోట్లు కొల్లగొట్టారు. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రూ.3.20 కోట్లతో రికార్డు నెలకొల్పగా.. వెటరన్ పేసర్ శిఖా పాండే (Shikha Pandey) సైతం భారీ ధర పలికింది. టీ20ల్లో అనుభవజ్ఞురాలైన ఈ స్పీడ్‌స్టర్ కోసం ఆర్సీబీ, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. కానీ, చివరకు యూపీ రూ.2.40 కోట్లు భారీ ధరకు కొనేసింది. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే నానుడికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది శిఖా. ఇంతకూ ఈ మీడియం పేసర్ పుట్టింది మన కరీంనగర్లో. మరి.. కరీంనగర్ టు టీమిండియా ప్లేయర్‌గా తన ప్రయాణం ఎలా సాగిందో తెలుసా..?
డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ మెగా టోర్నీలో మూడు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ఆడిన శిఖా కోసం వేలంలో ఫ్రాంచైజీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడించింది. విదేశీ లీగ్స్(బిగ్‌బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, విమెన్స్ సూపర్ స్మాష్)లో ఆడుతూ మంచి ఫామ్‌లో ఉన్న ఆమెను చివరకు యూపీ వారియర్స్ రూ.2.40 కోట్లకు దక్కించుకుంది. నాలుగో సీజన్లో కొత్త జట్టుకు ఆడడంపై శిఖా సంతోషం వ్యక్తం చేసింది.
Experience 🤝 Class
New threads for Shikha Pandey as she joins @UPWarriorz for a whopping INR 2.4 Crore 💛💜#TATAWPL | #TATAWPLAuction pic.twitter.com/nMvcWjsfvC
— Women’s Premier League (WPL) (@wplt20) November 27, 2025
‘వేలం గురించి నిన్నటి నుంచి ఆసక్తిగా ఎదురుచూశా. అయితే.. ఏం జరిగితే అది జరుగుతుందని మనసుకు సర్ధి చెప్పాను. గత మూడు సీజన్లు నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు యూపీ వారియర్స్ ఫ్యామిలీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్తటీమ్కు ఆడనుండడం కచ్చితంగా సరికొత్త ఫీలింగ్. డబ్ల్యూపీఎల్‌లో మూడేళ్లు నాకు అవకాశం కల్పించిన ఢిల్లీ ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు. ఇక యూపీలోని చాలామందితో నేను కలిసి ఆడాను. మేగ్ లానింగ్‌కు కెప్టెన్సీ ఇస్తారని అనుకుంటున్నా’ అని 36 ఏళ్ల శిఖా చెప్పింది. డబ్ల్యూపీఎల్‌లో బౌలింగ్ రికార్డు విషయానికొస్తే ఆరో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచింది శిఖా. మూడు సీజన్లలో ఢిల్లీ తరఫున 27 మ్యాచులు ఆడిన తను 30 వికెట్లు తీసింది.
🚨 36 years old veteran Shikha Pandey went to UP Warriors for huge 2.40 crores!
– Getting paid 2.40 crores at age of 36.
– She has been a great player in WPL & WBBL.
RCB went for her till 2.20 crores. Dont know why Indian team ignored her for 2 yrs❤️🐐pic.twitter.com/x3nv8bskYv
— Rajiv (@Rajiv1841) November 27, 2025
కరీంనగర్‌లోని రామగుండంలో జన్మించిన శిఖా.. హిందీ టీచర్ తండ్రి సుభాష్ పాండే (Subhash Pandey)కు గోవాకు బదిలీ కావడంతో అక్కడే పెరిగింది. గోవా తరఫునే అంతరాష్ట్ర టోర్నీల్లో ఆడిన ఆమె.. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎదిగింది. దేశవాళీలో మెరిసిన శిఖా 2014లో బంగ్లాదేశ్‌పై అరంగేట్రం చేసింది. తద్వారా గోవా నుంచి భారత జట్టుకు ఎంపికైన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. తొమ్మిదేళ్లపాటు భారత క్రికెట్‌కు విశేష సేవలందించిందీ మీడియం పేసర్. రెండేళ్ల క్రితం చివరిసారి టీమిండియా జెర్సీ వేసుకున్న ఆమె ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్లో రాణిస్తోంది. ఆటలోనే కాదు చదువులోనూ తను చురుకైన విద్యార్థే. గోవాలోనే ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన శిఖా.. తర్వాత భారత వైమానిక దళంలోనూ కొన్నాళ్లు పనిచేసింది.
#IAF Achievers: Sqn Ldr Shikha Pandey will be a pt of Indian Women’s cricket team in the ICC T-20 World Cup. She also features in ICC Women’s ODI Team of the Year 2019. “Playing for my country is a passion realised and donning the IAF uniform is a dream come true”, she says. pic.twitter.com/ax5RPEpKaz
— Indian Air Force (@IAF_MCC) January 18, 2020