టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఆల్ ది బేక్స్ అనే స్టార్టప్ కంపెనీ నడిపే మిట్టలి పారూల్కర్తో చాలా కాలంగా శార్దూల్ ప్రేమలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బీకేసీలోని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఫంక్షన్ హాల్లో ఎంగేజ్మెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్, ధవల్ కులకర్ణి హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కు కేవలం 75 మంది సన్నిహితులను మాత్రమే ఈ జంట ఆహ్వానించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.
30 ఏళ్ల శార్దూల్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారతజట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు జరిగిన ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రోఫీ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టుల్లో కూడా బంతితో, బ్యాటుతో రాణించి అందరినీ ఆకట్టుకున్నాడు. వచ్చే నెలలో జరిగే సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టకు శార్దూల్ కీలకం కానున్నాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
Congratulations Lord Shardul 🥳❤#Shardulthakur pic.twitter.com/kse167HoMN
— Suresh Raina FC™ (@CultRaina) November 29, 2021