IPL 2025 : ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించే సమయం వచ్చేసింది. తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌ల మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది. సో.. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు జట్లు టైటిల్ కోసం సర్వ శక్తులు ఒడ్డడం ఖాయం. కాబట్టి.. మ్యాచ్ కంటే ముందు ముగింపు వేడుకల్ని(IPL Closing Ceremony) అట్టహాసంగా జరపాలని బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం సెలబ్రిటీ గాయకులను రప్పించి.. వాళ్లతో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. ఈసారి బాలీవుడ్ సింగర్ శంకర్ మహదేవన్(Shankar Mahadevan) క్లోజింగ్ సెరమొనీ కచేరీకి నేతృత్వం వహించనున్నాడు.
ఐపీఎల్ ఫైనల్‌ను వీక్షించేందుకు భారత త్రివిధ దళాధిపతులు ఫైనల్‌కు విచ్చేయన్నారు. ఈ నేపథ్యంలో ముగింపు వేడుకల్లో ‘ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor), దేశ భక్తిని ప్రతిబింబించే పాటలకు ప్రాధాన్య ఇవ్వాలని బీసీసీఐ భావించింది. అందుకే.. స్వర మాంత్రికుడు శంకర్ మహదేవన్ను పురమాయించింది భారత బోర్డు. మంగళవారం ఆయన తన కుమారులు శివం మహదేవన్, సిద్ధార్ధ్ మహదేవన్‌లతో కలిసి దేశభక్తి పాటలు ఆలపించనున్నాడు.
A Grand #Final. A Grander Salute. 🫡
As the final chapter of #TATAIPL 2025 unfolds, we take a moment to applaud our nation’s true heroes, the Indian Armed Forces. 🇮🇳💙
Get ready to witness an unforgettable evening where patriotism takes centre stage and music moves the soul,… pic.twitter.com/QucxvMXhAW
— IndianPremierLeague (@IPL) June 2, 2025
భారత సైనికుల ధైర్య సాహసాలను కీర్తిస్తూ సాగే ఈ కార్యక్రమం కోసం స్టేడియాన్ని తిరంగా థీమ్‌తో ముస్తాబు చేయనున్నారు నిర్వాహకులు. పలు చోట్ల మువ్వన్నెల జెండాలు, లైట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి నరేంద్ర మోడీ స్టేడియం రేపు ఇటు దేశభక్తి గీతాలతో, అటు క్రికెట్ మజాతో సందడిగా సాగనుంది.
లీగ్ దశ నుంచి టైటిల్ గెలవాలనే కసితో ఆడిన రెండు జట్ల మధ్య అంతిమ సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్‌లో బలమైన జట్లకు చెక్ పెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ పోరులో అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆర్సీబీకి ఇది నాలుగో ఫైనల్ కాగా.. పంజాబ్‌కు ఇది రెండోది. ఇప్పటివరకూ విజేతగా నిలవని ఈ రెండు టీమ్‌లు ఇప్పుడు తమ కలల ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచాయి. ఇరుజట్లు లీగ్ దశలో ఎదురుపడిన రెండు మ్యాచుల్లో చెరొకటి గెలిచాయి.
Make way for the 𝐏𝐮𝐧𝐣𝐚𝐛 𝐊𝐢𝐧𝐠𝐬 ❤️
They are all locked in to meet #RCB for the 𝘽𝙄𝙂 𝙊𝙉𝙀 🔥 #TATAIPL | #PBKSvMI | #Qualifier2 | #TheLastMile | @PunjabKingsIPL pic.twitter.com/L6UqDoMs50
— IndianPremierLeague (@IPL) June 1, 2025
అయితే.. క్వాలిఫయర్ 1లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ 101 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 10 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. అనంతరం క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. కప్ వేటలో ఉన్న ఆర్సీబీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది. అయితే.. ఇద్దరిలో ఎవరు విజేతగా నిలిచినా కొత్త ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించడంఖాయం.
Prediction Time 💭
Who will carve their name in the 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙮 𝘽𝙤𝙤𝙠𝙨? 🤔
Let us know 👇#TATAIPL | #Final | #RCBvPBKS | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/ZwAKXED1iX
— IndianPremierLeague (@IPL) June 2, 2025