PAK vs ENG 1st Test : పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్(151) సెంచరీతో చెలరేగాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్ (England) పేసర్లను ఊచకోత కోస్తూ విధ్వంసక శతకం బాదేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో సారథిగా మొదటి వంద కొట్టిన అతడు తనను పని గట్టుకొని విమర్శిస్తున్న వాళ్ల నోళ్లకు తాళం వేశాడు. రికార్డులకు నెలవైన ముల్తాన్ మైదానం(Multan Stadium)లో బౌండరీలతో విరుచుకుపడిన మసూద్.. ఈ పదేండ్లలో పాక్ తరఫున వేగవంతమైన శతకం నమోదు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(102) సుడిగాలి ఇన్నింగ్స్‌తో కోలుకున్న పాక్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.
బాబర్ ఆజాం వారసుడిగా టెస్టు పగ్గాలు అందుకున్న మసూద్ తొలి సెంచరీతో గర్జించాడు. విదేశీ పిచ్‌లపై తేలిపోయిన అతడు.. స్వదేశంలో అందివచ్చిన అవకాశాన్ని సొమ్ముచేసుకొని వందతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో ముల్తాన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ సయీం ఆయూబ్(4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మసూద్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(102)తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ పేస్ దళాన్ని.. స్పిన్ ద్వయం జాక్ లీచ్, షోయబ్ బషీర్‌లను సమర్ధంగా ఎదుర్కొంటూ బౌండరీలు సాధించాడు.
Under pressure coming into the series, Shan Masood makes a statement in Multan 🫡 #PAKvENG pic.twitter.com/dg2C65y6hj
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2024
‘బజ్‌బాల్’ తరహా ఆటతో కేవలం 102 బంతుల్లోనే మసూద్ సెంచరీకి చేరువయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 1,524 రోజుల తర్వాత ఇదే అతడికి తొలి శతకం. షఫీక్‌తో కలిసి రెండో వికెట్‌కు 253 రన్స్ జోడించిన మసూద్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సమయంలో జాక్ లీచ్ అతడిని రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. దాంతో, 151 పరుగుల వద్ద పాక్ కెప్టెన్ మెరుపు బ్యాటింగ్‌కు తెరపడింది. ప్రస్తుతం మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం(11), సాద్ షకీల్(12)లు ఆడుతున్నారు. మూడో సెషన్లో పాక్ స్కోర్.. 286-3.
The 253-run stand is broken!
Abdullah Shafique falls to Gus Atkinson after reaching three figures in Multanhttps://t.co/jamBKcZQ6G | #PAKvENG pic.twitter.com/lTCrYM2P36
— ESPNcricinfo (@ESPNcricinfo) October 7, 2024