CPL 2024 : సెయింట్ లూసియా కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ గయానా అమెజాన్ వారియర్స్(Guyana Amazon Warriors)కు చెక్ పెడుతూ.. 11 ఏండ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రోస్టన్ ఛేజ్(1/13, 39 నాటౌట్) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. దాంతో, 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సెయింట్ లూసియా ట్రోఫీ కలను సాకారం చేసుకుంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూయిస్ తొలిసారి విజేతగా అవతరించింది. 11 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ మెగా టోర్నీలో చాంపియన్ ట్యాగ్ సొంతం చేసుకుంది. ఫాఫ్ డూప్లెసిస్ సారథ్యంలోని సెయింట్ లూసియా ఈ సీజన్ ఆసాంతం ప్రత్యర్థులను వణికించింది.
A euphoric moment for the Saint Lucia Kings! 🇱🇨 #CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/fQZSG3C4WV
— CPL T20 (@CPL) October 7, 2024
ఇక జరిగిన ఆదివారం ఫైనల్లో అదే జోరు చూపిస్తూ డిఫెండింగ్ చాంపియన్ గయానా అమెజాన్ వారియర్స్‌ను చిత్తుగా ఓడించింది. 139 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించి ట్రోఫీని పట్టేసింది. టాపార్డర్ విఫలమైనా రోస్టన్ ఛేజ్ (39 నాటౌట్), అరోన్ జోన్స్ (48)లు అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు
గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 138 రన్స్ చేసింది. నూర్ అహ్మద్(3/19) విజృంభణతో ఓపెనర్ మోయిన్ అలీ(14), విధ్వంసక హిట్టర్ షిమ్రన్ హెట్‌మైర్(11), రీఫర్(13)లు డగౌట్‌కు చేరారు. 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గయానా టీమ్‌ను ఆల్‌రౌండర్లు రొమారియో షెపర్డ్(19), ప్రిటోరియస్(25)లు ఆదుకున్నారు. ఆఖర్లో ధనాధన్ ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. సెయింట్ లూసియా హీరో రోస్టన్ చేజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు రాగా.. యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు.