Rajinikanth – KS Ravikumar | సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు సీనియర్ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్. తలైవర్ వలనే నా లింగ సినిమా ఫ్లాప్ అయ్యిందని ఆరోపించాడు. రజనీకాంత్ – కె.ఎస్.రవికుమార్‌ల హిట్ కాంబో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబోలో వచ్చిన ముత్తు, నరసింహా చిత్రాలు బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాయి. ఇక ఈ కాంబోలో వచ్చిన మూడో చిత్రమే లింగ. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో అనుష్కా, సోనాక్షి సిన్హా కథానాయికలుగా నటించగా.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో ప్రేక్షకల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా మిగిలింది.
అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం రజనీకాంత్ అని.. లింగ ఎడిటింగ్ విషయంలో తలైవర్ జోక్యం చేసుకుని సినిమా నాశనం చేశాడని తెలిపాడు. ఈ సినిమా సీజేఐ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను కూడా తలైవర్ తీసేశారు. బెలూన్ జంపింగ్ సీన్ ఆర్టిఫిషియల్‌గా ఉంటుందన్న కూడా ఆయనే జోడించారు. మొత్తానికి ఆ సినిమాను నాశనం చేసి వదిలేశాడు అంటూ కె.ఎస్.రవికుమార్. తెలిపాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.