అమరావతి : ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF jawan ) మృతి చెందాడు. జిల్లాలోని చింతూరు డివిజన్ డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంధ్రా(Andhra), ఒడిస్సా(Odisha) సరిహద్దులో ఆదివారం రాత్రి సీఆర్పీఎఫ్ జవానులు కూంబింగ్ నిర్వహించారు.
వేటగాళ్లు అడవిపందుల కోసం వేసిన విద్యుత్ తీగలు గమనించని తమిళనాడుకు చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ తిరునవకరస ప్రమాదవశాత్తు ఆ తీగకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆయన మృతి చెందాడు. తోటి జవానులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.