Mohammad Shami : రంజీ ట్రోఫీలో భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) నిప్పులు చెరుగుతున్నాడు. తన ఫిట్‌నెస్‌పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెడుతూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడీ స్పీడ్‌స్టర్. ఉత్తరాఖండ్‌పై ఏడు వికెట్లతో చెలరేగిన షమీ.. ఈసారి గుజరాత్‌పైనా విజృంభించాడు. చివరిరోజు ఐదు వికెట్లు తీసిన ఈ పేస్ గన్.. బెంగాల్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయం దిశగా సాగుతున్న ప్రత్యర్థిని షమీ దెబ్బకొట్టగా.. పన్నెండేళ్ల తర్వాత బెంగాల్ జట్టు గుజరాత్‌పై విజయాన్ని చవిచూసింది.
టీమిండియాకు మళ్లీ ఆడేందుకు ఎదురుచూస్తున్న షమీ.. రంజీ ట్రోఫీ రెండో రౌండ్లోనూ చెలరేగిపోతున్నాడు. ఉత్తరాఖండ్‌పై ఏడు వికెట్లు.. గుజరాత్‌పై ఐదు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్ సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. సొంతగడ్డపై నవంబర్‌లో దక్షిణాఫ్రికా(South Africa)తో రెండు టెస్టుల సిరీస్‌కు స్క్వాడ్ ఎంపిక సమయంలో తన పేరును పరిశీలించాలని చెప్పకనే చెబుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌ను 214/8 వద్ద డిక్లేర్ చేసిన బెంగాల్‌కు గుజరాత్ షాకిచ్చేలా కనిపించింది.
15 wickets in 2 matches 😱✅
Mohammad Shami showing pure class in Ranji Trophy 💪🦁 pic.twitter.com/WDK0L0JVFW
— CricXtasy (@CricXtasy) October 28, 2025
బెంగాల్ నిర్దేశించిన 326 పరుగుల ఛేదనలో ఉర్విల్ పటేల్(109 నాటౌట్), జయమీత్ పటేల్(45)లు సెంచరీ భాగస్వామ్యంతో గుబులు రేపారు. అయితే.. నాలుగో రోజు రెండో సెషన్లో ఉర్విల్ రిటైర్డ్ హర్ట్ అయ్యాక షమీ చెలరేగిపోయాడు. వరుసగా వికెట్లు తీసి గుజరాత్ పతనాన్ని శాసించాడు. అతడి విజృంభణతో 153/3తో పటిష్ట స్థితిలో ఉన్న జట్టు 185 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో మెరిసిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌తో ఐదు వికెట్లు తీసి బెంగాల్‌ను 141 పరుగుల తేడాతో గెలిపించాడు. ఇప్పటివరకూ అతడు రెండు మ్యాచుల్లో కలిపి పదిహేను వికెట్లు పడగొట్టడం విశేషం. వరుసగా రెండు విజయాలతో ఎలైట్ గ్రూప్ సీ పట్టికలో బెంగాల్ రెండో స్థానానికి దూసుకెళ్లింది.