Shakib Al Hasan : పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయోత్సాహంలో ఉన్న బంగ్లాదేశ్(Bangladesh)కు భారీ షాక్. ఇప్పటికే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్(Shakib Al Hasan )కు జరిమానా పడింది. రావల్పిండి టెస్టు (Rawalpindi Test)లో అతడు ఐసీసీ నియమావళిని ఉల్లంఘించడమే అందుకు కారణం. ఆట ఆఖరోజైన ఆదివారం షకీబ్ బంతిని పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan)పైకి విసిరాడు.
ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. దాంతో, షకీబ్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది. అసలేం జరిగిందంటే..? రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ విజయానికి ఆరు వికెట్లు అవసరమైన దశలో షకీబ్ బంతి అందుకున్నాడు. అప్పటికీ పాక్ స్కోర్ 103-4.
Mental state like Shakib Al Hasan
Academic performance like Babar Azam 💀pic.twitter.com/G3noKlmhzr— Dinda Academy (@academy_dinda) August 25, 2024
ఆ సమయంలో క్రీజులో మహ్మద్ రిజ్వాన్(18), నాన్ స్ట్రయికింగ్‌లో అబ్దుల్లా(37) ఉన్నారు. ఇక రనప్ పూర్తి చేసి షకీబ్ బంతిని విసిరేందుకు సిద్ధమయ్యాడు. అయితే బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేని పక్కకు జరిగాడు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన షకీబ్ బంతిని రిజ్వాన్ తల మీదుగా వికెట్ కీపర్ వైపు విసిరాడు.
ముష్ఫికర్ రహీమ్(191)
ఊహించని పరిణామంతో షాక్ తిన్న అంపైర్ ఇదేంటీ.. ఏం చేస్తున్నావ్ అంటూ షకీబ్ తీరును తప్పు పట్టాడు. అంతేకాదు ఆ బంతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం షకీబ్ దురుసు ప్రవర్తనను ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాడు. షకీబ్ వీడియో పరిశీలించిన ఐసీసీ క్రమశిక్షణ కమిటీ అతడు నియమాలను ఉల్లంఘించినట్టు తేల్చింది. అందుకు శిక్షగా అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.
స్వదేశంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సారథ్యంలోని బంగ్లా.. పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. యువ ఆల్‌రౌండర్ మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది.