లక్నో: రెండు గ్రూపుల మధ్య ఘర్షణను నివారించేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్‌పై కొందరు దాడి చేశారు. ఈ సందర్భంగా ఒక యువతి కర్రతో పోలీస్‌ను కొట్టింది. (Woman Hits Cop With Stick) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్లో ఈ సంఘటన జరిగింది. ఆగస్టు 19న రక్షా బంధన్ సందర్భంగా సిద్ధువ ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన జాతరను వీక్షించేందుకు వెళ్తున్న రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఒక పోలీస్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఇరు వర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఆ పోలీస్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒక యువతి కర్రతో ఆ కానిస్టేబుల్‌ను కొట్టింది. మరో వ్యక్తి ఆ పోలీస్‌ను నెట్టడంతోపాటు చొక్కా పట్టుకుని చించేశాడు. అయితే అక్కడున్న ఎవరూ కూడా ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను కాపాడేందుకు ముందుకు రాలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
"दुस्साहस : खाकी पर हाथ"
दो पक्षों में विवाद की सूचना पर पहुंचे @Uppolice के सिपाही से भिड़े दबंग,युवती ने डंडा लेकर दौड़ाया…!#VideoViral 📸यूपी के कुशीनगर में रक्षाबंधन के दिन दो पक्षों में विवाद की सूचना मिली जिसपर सिपाही मौके पर जाकर बीच बचाव करा रहा था।
इस दौरान दोनों… pic.twitter.com/5qtgjCva3h— Rahul Saini (@JtrahulSaini) August 26, 2024