దుబాయ్: భారత్‌తో జరుగుతున్న ఆసియా కప్ అండర్-19(Asia Cup Under-19) మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 రన్స్ చేసింది. పాకిస్థాన్ బ్యాటర్ షాజైబ్ ఖాన్ సెంచరీతో కదం తొక్కాడు. షాజైబ్ 147 బంతుల్లో 5 ఫక్షర్లు, 10 సిక్సర్ల సాయంతో 159 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆరంభంలో పాక్ ఓపెనర్లు ఇరగదీశారు. ఉస్మాన్ ఖాన్, షాజైబ్ ఖాన్ ఇద్దరూ తొలి వికెట్‌కు 160 రన్స్ జోడించారు. ఉస్మాన్ ఖాన్ 60 రన్స్ చేసి మాత్రే బౌలింగ్‌లో ఔటయ్యాడు. షాజైబ్ సెంచరీతో అదరగొట్టినా.. పాక్ లోయర్ ఆర్డర్ ప్లేయర్లు మాత్రం తడబడ్డారు. భారత బౌలర్లలో నాగరాజు మూడు, మాత్రమే రెండేసి వికెట్లు తీసుకున్నారు. గుహ, కిరణ్‌లకు ఒక్కొక్క వికెట్ దక్కాయి.
Shahzaib Khan’s superb 159 featuring 1️⃣0️⃣ sixes lifts Pakistan U19 to 281-7 🏏#PAKvIND | #PakistanFutureStars | #ACCMensU19AsiaCup pic.twitter.com/AJbwiWDXWo
— Pakistan Cricket (@TheRealPCB) November 30, 2024