World Cup Final : తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్లు సెంచరీ భాగస్వా్మ్యంతో శుభారంభం ఇచ్చినా మిడిలార్డర్ వైఫల్యంతో 300 మార్క్ అందుకోలేకపోయింది. చివరి పది ఓవర్లో 69 రన్స్ మాత్రమే రావడంతో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగలిగింది.
సొంత గడ్డపై వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్న భారత జట్టు రికార్డు స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ ఓపెనర్లు షఫాలీ వర్మ(87), స్మృతి మంధాన(45) శతక భాగస్వామ్యంతో బలమైన పునాది వేయగా.. మిడిలార్డర్లో దీప్తి శర్మ (58), రీచా ఘోష్(34)లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. డెత్ ఓవర్లలో స్లో బాల్స్‌తో సఫారీలు కట్టడి చేయాలనుకున్నా.. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది టీమిండియా. ఈ జాబితాలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.
Innings Break!
A flourish from Deepti Sharma and Richa Ghosh propels #TeamIndia to 2⃣9⃣8⃣/7 after 50 overs 🤜🤛
Over to our bowlers now! 👍
Scorecard ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final pic.twitter.com/eFNztfR0xQ
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
వర్షం అంతరాయంతో టాస్ గంటకుపైగా ఆలస్యమైన మ్యాచ్‌లో భారత జట్టుకు శుభారంభం లభించింది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తూ బౌండరీలతో రెచ్చిపోయారు షఫాలీ వర్మ(87), స్మృతి మంధాన(45). సఫారీ ప్రధాన పేసర్ మరిజానే కాప్ తొలి ఓవర్లో
ఒక్క పరుగు రాకున్నా.. రెండో ఓవర్లోనే ఖాకాకు షఫాలీ బౌండరీతో స్వాగతం పలికింది. ఇక నాలుగో ఓవర్లో కాప్‌ను బెంబేలెత్తిస్తూ వరుసగా రెండు ఫోర్లు కొట్టింది లేడీ సెహ్వాగ్. ఖాక వేసిన ఆరో ఓవర్లో మంధాన రెండు వరుస బౌండరీలతో స్కోర్ 40 దాటించింది. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిధాలీ రాజ్ రికార్డును బ్రేక్ చేసింది మంధాన. 2017 వరల్డ్ కప్‌లో 409 పరుగులతో మాజీ కెప్టెన్ నెలకొల్పిన రికార్డును దాటేసింది.
Second-fastest 5⃣0⃣ in a women’s ODI WC final ✅
Youngest to score a 5⃣0⃣ in an ODI World Cup final ✅Shafali Verma’s fiery 87 set the tone for #TeamIndia 👏
Updates ▶ https://t.co/TIbbeE4ViO#WomenInBlue | #CWC25 | #INDvSA | #Final | @TheShafaliVerma pic.twitter.com/gLxuVCTZyA
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
పవర్ ప్లేలో 64 రన్స్‌తో గట్టి పునాది వేసిన ఈ జోడీ.. సెంచరీ భాగస్వామ్యంతో సఫారీలను విసిగించింది. ప్రధాన పేసర్లు విఫలమైన వేళ బంతి అందుకున్న ట్రయాన్.. మంధానను ఔట్ చేసి తొలి బ్రేకిచ్చింది. ఆ తర్వాత ఖాక వరుస ఓవర్లలో షఫాలీ, జెమీమా రోడ్రిగ్స్(24)ను ఔట్ చేసి.. ఒత్తిడి పెంచింది. 57 పరుగుల వద్ద షఫాలీకి సునే లుస్ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ లభించింది. కానీ, 5 పరుగుల తేఆతో రెండు కీలక వికెట్లు పడిన వేళ దీప్తి శర్మ(58) తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్(20) కీలక ఇన్నింగ్స్ ఆడాలనుకుంది.
కానీ.. ఎలంబా ఓవర్లో తను అనూహ్యంగా క్లీన్‌బౌల్డ్ అయింది. కాసేపటికే డీక్లెర్క్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది అమన్‌జోత్. అనంతరం క్రీజులోకి వచ్చిన రీచా ఘోష్ (34) సిక్సర్‌తో స్కోర్ 250 మార్క్ దాటింది. డెత్ ఓవర్లలో సఫారీలు మెరుగ్గా బౌలింగ్ చేసినా.. రీచా, దీప్తిలు బౌండరీలతో స్కోర్ వేగం పెంచారు. అయితే.. ఖాకా ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన రీచా బౌండరీ వద్ద డెర్క్సెన్ చేతికి చిక్కింది. ఆఖరి ఓవర్లో ఆరు పరుగులే రావడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298కే పరిమితమైంది.
Runs galore 🔢
Smriti Mandhana adds yet another special accolade to her excellent #CWC25 campaign ✅
Updates ▶ https://t.co/TIbbeE4ViO#TeamIndia | #WomenInBlue | #INDvSA | #Final | @mandhana_smriti pic.twitter.com/Jlolhg7sPJ
— BCCI Women (@BCCIWomen) November 2, 2025