కాటారం, జనవరి 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మేడిపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థిని గీతాంజలి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. నారాయణపేట జిల్లాలో ఇటీవల నిర్వహించిన సబ్ జూనియర్ ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఈ నెల 29, 30, 31 తేదీల్లో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. అలాగే మండలకేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకులానికి చెందిన శ్రీలేఖ హ్యాండ్‌బాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నాగలక్ష్మి తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో శ్రీలేఖ పాల్గొననుంది.