Virender Sehwag : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 27 రోజుల్లో భారత గడ్డపై మెగా టోర్నీ షురూ కానుంది. ఈ నేపథ్యలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) తనడ్రీమ్ వన్డే జట్టు(Dream ODI XI)ను ప్రకటించాడు. అయితే.. ఆశ్చర్యకరంగా మొదటి ఐదుగురిలో ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు కల్పించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli), జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumrah)లను వీరూ సెలెక్ట్ చేశాడు.
ఇక మిగిలిన రెండు స్థానాలను ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner), న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్(Glenn Philiphs)లు దక్కించుకున్నారు. వీళ్లను మాత్రమే తన డ్రీమ్ వన్డే ఎక్స్ టాప్-5లోకి తీసుకోవడానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ, కోహ్లీ, వార్నర్, ఫిలిఫ్స్, బుమ్రా
Former India opener Virender Sehwag has picked the first five players he would select in a dream ODI XI 👀https://t.co/Ks6b1hjCq9
— ICC (@ICC) September 8, 2023
రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచ కప్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఏకంగా ఐదు సెంచరీలు బాదాడు. దాంతో, 648 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బ్యాట్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు మరెవరకీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. 50 ఓవర్ల ఆటలో గొప్ప రికార్డు ఉన్నందుకు హిట్‌మ్యాన్‌ను టాప్ -5లో ఒకడిగా వీరూ ఎంపిక చేశాడు.
రోహిత్ శర్మ
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో రారాజుగా వెలుగొందుతున్నాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 46 శతకాలు ఉన్నాయి. నిరుడు ఆసియా కప్‌తో ఫామ్ అందుకున్న అన్ని ఫార్మాట్లలో వరుస సెంచరీలతో జోరు మీదున్నాడు. ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడైన కోహ్లీ ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో కీలకం కానున్నాడు. అందుకని కెరీర్లోనే సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్‌ను మించిన చాయిస్ ఉండదనేది సెహ్వాగ్ అభిప్రాయం.
విరాట్ కోహ్లీ
వార్నర్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్‌గా ఆస్ట్రేలియాకు చాలా విజయాలు అందించాడు. క్రీజులో కుదురుకున్నాక బౌలర్లపై విరుచుకుపడడం ఇతడి నైజం. వార్నర్ ఆట దాదాపు సెహ్వాగ్ మాదిరిగానే ఉంటుంది. వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిట్సల్ తరఫున దంచి కొట్టాడు. ఆ తర్వాత యాషెస్ సిరీస్‌లో భారీ స్కోర్లు చేయకున్నా ఉస్మాన్ ఖవాజాతో కలిసి శుభారంభాలు ఇచ్చాడు.
వార్నర్
విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గ్లెన్ ఫిలిఫ్స్ బంతిని బలంగా బాదుతాడు. లోయర్ ఆర్డర్లో ధనాధన్ ఆడే ఇతడు న్యూజిలాండ్ వరల్డ్ కప్ స్క్వాడ్‌లో స్థానం సంపాదించాడు. ఈ ఆల్‌రౌండర్‌కు ఇదే తొలి వన్డే వరల్డ్ కప్ కావడం విశేషం. ఇప్పటివరకూ ఫిలిఫ్స్ 16 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే.. నిరుడు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్ కప్‌లో ఫిలిఫ్స్ శ్రీలంకపై మెరపు సెంచరీ బాదాడు.
గ్లెన్ ఫిలిఫ్స్
ప్రస్తుతం ప్రపంచంలోని మేటి బౌలర్లలో బుమ్రా ఒకడు. ఈమధ్యే ఐర్లాండ్ సిరీస్‌తో పునరాగమనం చేసిన బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ కింగ్ ఆసియా కప్, ప్రపంచ కప్‌లో కీలకం కానున్నాడు.
బుమ్రా
టీమిండియా సాధించిన గొప్ప విజయాల్లో సెహ్వాగ్ పాత్ర ఉంది. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో వీరూ సభ్యుడు. అంతేకాదు భారత్ తరఫున టెస్టుల్లో మొదటి ట్రిపుల్ సెంచరీ కొట్టింది సెహ్వాగే. ఈ డాషింగ్ ఓపెనర్ వన్డేల్లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన వీరూ ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.