Ccoco Gauff : యూఎస్ ఓపెన్(US Open 2023)లో దుమ్మురేపుతున్న అమెరికా టీనేజర్ కొకో గాఫ్(Coco Gauff) అరుదైన ఫీట్ సాధించింది. మహిళల టెన్నిస్‌లో దిగ్గజం సెరెనా విలియమ్స్(Serena Williams) సరసన నిలిచింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన కరోలినా మునిచ్(Karolína Muchova)ను గాఫ్ చిత్తుగా ఓడించింది. ఈ రెండేళ్లలో ఆమెకు ఇది 25 గ్రాండ్‌స్లామ్ విజయం. దాంతో, సెరెనా తర్వాత ఈ ఘనత సాధించిన తొలి అమెరికా క్రీడాకారిణిగా గాఫ్ రికార్డు సృష్టించింది.
ఈ సీజన్లో అదరగొడుతున్న గాఫ్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న హోరాహోరీగా జరిగిన సెమీ ఫైనల్లో గాఫ్ 6-4, 7-5తో ముచోవపై గెలుపొందింది. ఈ టీనేజ్ సంచలనానికి ఇది రెండో గ్లాండ్ స్లామ్ ఫైనల్ కావడం విశేషం. నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఇగా స్వియటెక్(Iga Swiatek) చేతిలో గాఫ్ ఓడిపోయింది.
కొకో గాఫ్
దాంతో, ఈసారి ఎలాగైనా గ్రాండ్ స్లామ్ చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉన్న ఆమె వరల్డ్ నంబర్ 1 అరినా సబలెంక( Aryna Sabalenka)తో తలపడనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీ గెలిచిన సబలెంక సెమీ ఫైనల్లో మడిసన్ కీస్(Madison Keys)ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
అరినా సబలెంక
ఈ ఏడాది ఆమెకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. దాంతో, ఈసారి చాంపియన్‌గా ఎవరు నిలుస్తారు? అనే ఆసక్తి నెలకొంది. యూఎస్ ఓపెన్‌లో సబలెంక అనూహ్యంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 16వ రౌండ్లో స్వియటెక్ ఓటమితో నంబర్ 1 ర్యాంక్ కోల్పోయింది. దాంతో, రెండో సీడ్‌గా ఉన్న సబలెంక నంబర్ 1 ర్యాంక్‌కు ఎగబాకింది.