న్యూయార్క్: టీ20 ప్రపంచకప్లో భాగంగా జూన్ 9న భారత్-పాక్ మ్యాచ్కు ఉగ్రముప్పు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో న్యూయార్క్ పోలీసులు ఈ మ్యాచ్కు భద్రతను పెంచారు. నసావు స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని న్యూయార్క్ గవర్నర్ క్యాతి హోచుల్ తెలిపారు. మ్యాచ్ జరిగే పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచాలని ఈ మేరకు న్యూయార్క్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.