IND Vs ENG Test | ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పోరాడుతున్నది. ప్రస్తుతం విజయానికి 30 పరుగులు దూరంలో ఉన్నది. టీ బ్రేక్ సమయానికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా, సిరాజ్ క్రీజులో ఉన్నారు. రవీంద్ర జడేజా 56 పరుగులు, సిరాజ్ 2 పరుగులు చేశారు. మిగతా టీమిండియా బ్యాట్స్‌మన్ విఫలమైనా.. రవీంద్ర జడేజా ఆచితూడి ఆడుతూ.. టెయిలెండర్స్‌తో కలిసి టీమిండియాను గెలిపించేందుకు భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. బుమ్రాతో కలిసి 35 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇద్దరు కలిసి 131 బంతులు ఎదుర్కోవడం విశేషం. ఐదోరోజు రెండోసెషన్ను ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగుల వద్ద సెషన్‌ను టీమిండియా ప్రారంభించింది. టీ విరామ సమయానికి తొమ్మిది వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన బుమ్రా పెవిలియన్‌కు చేరాడు. స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. బుమ్రా 54 బంతుల్లో ఒక ఫోర్ సహాయంతో ఐదు పరుగులు చేయడం గమనార్హం.
బహుశా ఇటీవలి కాలంలో అత్యంత విచిత్రమైన సెషన్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లార్డ్స్ వేదికగా జరుగుతన్న చివరి రోజు రెండో సెషన్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జట్టు విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉంది. ఈ ఓవర్లో 31.3 ఓవర్లలో 51 పరుగులు వచ్చాయి. జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొమ్మిది ఓవర్ల స్పెల్ తర్వాత పది ఓవర్ల స్పెల్‌తో స్టోక్స్ బౌలింగ్ చేశాడు. సాఫ్ట్ బాల్‌తో విజయానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేశాడు. టీమిండియా చివరి బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఇంగ్లండ్ బౌలర్లను అడ్డుకున్నారు. బుమ్రా 54 బంతులు ఆడి కేవలం ఐదు పరుగులు చేశాడు. సిరాజ్ 20కిపైగా బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేశాడు.