Pawan Kalyan | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (OG) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. వర్షం కురిసినా అభిమానుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. వేలాది మందితో స్టేడియాం కిక్కిరిసిపోయింది. పవన్ కల్యాణ్ స్టేజీపైకి కత్తిని చేతిలో పట్టుకుని మెగా స్టైల్లో వేదికపైకి ఎంట్రీ ఇవ్వడం అభిమానులకి మాంచి కిక్ ఇచ్చింది. ఫ్యాన్స్ పవన్ ఎంట్రీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పవనన్నా ఎలివేషన్ ఓ రేంజ్లో ఉందని కామెంట్ చేస్తున్నారు.. ఈ ఎంట్రీకి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ వీడియోలో పవన్ కత్తిని తిప్పినప్పుడు వెనక ఉన్న సెక్యూరిటీ పర్సన్‌కి ఇంచెలో మిస్ అయింది.
అది తగిలి ఉంటే కనుక పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని, కత్తులు పట్టుకొని రావడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు మాత్రం చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ని మళ్లీ సినిమాటిక్ లుక్‌లో చూశామని, అదిరిపోయిందంతే అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సుజీత్ నాకు పెద్ద అభిమాని. కథను ముక్కలు ముక్కలుగా చెప్పినా, డైరెక్షన్లో మాత్రం అదరగొట్టాడు. థమన్ ఈ సినిమాకు ఇంకో హీరో లాంటివాడు. ఈ సినిమాలో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను… డిప్యూటీ సీఎం అన్న విషయమే మర్చిపోయాను,” అని మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు పవన్ కళ్యాణ్.
“ఖుషి సినిమా తరువాత నా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్నారని తెలిసింది. ఇప్పుడు అదే సినిమా OG,” అని చెప్పారు. ఇక సుజిత్ టీమ్ చాలా బాగుంది. ఇలాంటి టీమ్ నా మొదట్నుంచి ఉంటే నేను రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదు,” అంటూ పవన్ స్పెషల్‌గా సుజీత్ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ గత కొన్ని సినిమాల్లో కనిపించిన పవర్ఫుల్ మ్యానరిజమ్స్ OG గ్లింప్స్‌లలో కనిపించడంతో, ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. డైరెక్టర్ సుజీత్ తన స్టైల్‌కి తగ్గట్లు విజువల్స్ ప్లాన్ చేయడం, థమన్ సంగీతం మాస్ ఆడియెన్స్‌ను రీచ్ కావడం OGకి స్పెషల్ హైప్ తీసుకువచ్చాయి.
1000 crores video 😭😭🔥🔥
Mass entry @PawanKalyan 🥵🥵
#OGConcert pic.twitter.com/SW35WQ6NHX
— Pawanism Network (@PawanismNetwork) September 21, 2025