PKL 2025 : ఐపీఎల్ తరహా క్రేజ్‌తో అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ (PKL 2025) జైపూర్‌కు తరలివెళ్లింది. పన్నెండో సీజన్ తొలి దశ మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యమివ్వగా రెండో దశ మ్యాచ్‌లు ‘పింక్ సిటీ’లో జరుగనున్నాయి. రెండుసార్లు ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ (Jaipur Pink Panthers)కు ఇది హోమ్ గ్రౌండ్.సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకూఅక్కడి కబడ్డీ ఫ్యాన్స్‌కు రైడర్లు, డిఫెండర్లు పూనకాలు తెప్పించనున్నారు. కబడ్డీ అంటే పడిచచ్చే సొంత ప్రేక్షకుల సమక్షంలో చెలరేగి పోవాలని నితిన్ రావల్ (Nitin Rawal) సారథ్యంలోని జైపూర్ టీమ్ భావిస్తోంది.
ప్రో కబడ్డీ లీగ్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే.. పలు నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. పీకేఎల్ 12వ సీజన్ ఆగస్టు 29న ప్రారంభమైంది. సెప్టెంబర్ 11 వరకూ మ్యాచ్‌లు జరిగాయి. ప్రస్తుతానికి నాలుగింటా రెండు విజయాలతో వెనుకబడిన జైపూర్ పింక్ పాంథర్స్ ఇక సొంతగడ్డపై చెలరేగిపోనుంది.
Daastan-e-Jaipur begins tomorrow 😍
The teams and our Pangebaaz are all set for the thrilling action to kick off in the Pink City. But before the battles begin, here’s the iconic PKL trophy standing tall in front of the historic Hawa Mahal ❤️#ProKabaddi #PKL12 #GhusKarMaarenge pic.twitter.com/4O7hzf7RSd
— ProKabaddi (@ProKabaddi) September 11, 2025
సెప్టెంబర్ 12 శుక్రవారం జరుగబోయే తొలి మ్యాచ్‌లో జైపూర్ జట్టు సమఉజ్జీ అయిన బెంగళూరు బుల్స్(Bengaluru Bulls)తో ఆడనుంది. రెండో గేమ్‌లో తమిళ్ తలైవాస్ (Tamil Talaivas)ను బెంగాల్ వారియర్స్ ఢీకొట్టనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పుణెరి పల్టన్, దబాంగ్ ఢిల్లీ జట్లు నాలుగేసి విజయాలతో టాప్-2లో నిలిచాయి. జైపూర్ విషయానికొస్తే ఆరంభ సీజన్లో.. ఆపై తొమ్మిదో సీజన్లో పీకేఎల్ టైటిల్ కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అనంతరం మూడో దశ మ్యాచ్‌లకు చెన్నై వేదిక కానుంది. నాలుగో దఫా కబడ్డీ కూత ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో వినిపించనుంది.