స్కాట్లాండ్ సూపర్.. రాణించిన మున్సె, లీస్క్
టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గ్రూపు-సీ పోరులో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇటలీపై ఘన విజయం సాధించింది.
- ఇటలీకి పరాభవం
కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన గ్రూపు-సీ పోరులో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో ఇటలీపై ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై బహిష్కరణ వేటుతో ఆఖరి నిమిషంలో మెగాటోర్నీ బెర్తు దక్కించుకున్న స్కాట్లాండ్ ఎట్టకేలకు పాయింట్ల ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిన స్కాట్లాండ్..మలి పోరులో అరంగేట్రం టీమ్ ఇటలీ భరతం పట్టింది.
తొలుత జార్జ్ మున్సె (54 బంతుల్లో 84, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు బ్రెండన్ మెక్‌ముల్లెన్ (41 నాటౌట్), ఆఖర్లో మిచెల్ లీస్క్(5 బంతుల్లో 22 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 207/4 స్కోరు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్తగా అడుగుపెట్టిన ఇటలీ పసలేని బౌలింగ్‌ను స్కాట్లాండ్ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు.
లక్ష్యఛేదనకు దిగిన ఇటలీ.. లీస్క్(4/17) ధాటికి 16.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. బెన్ మనెటీ(52) అర్ధసెంచరీ మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించి లీస్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

