మంగళవారం 09 మార్చి 2021
Sports - Jan 31, 2021 , 02:51:37

ఎస్సీ రుణాల దరఖాస్తు గడువు పెంచండి

ఎస్సీ రుణాల దరఖాస్తు గడువు పెంచండి

  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు నేతల వినతి

హైదరాబాద్‌, జనవరి 30 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్‌: ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకొనే గడువును పెంచాలని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య, ఎమ్మార్పీఎస్‌ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్‌ వినతిపత్రం సమర్పించారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రిని ఆయన నివాసంలో కలిసి పలు అంశాలపై నివేదించారు. కరోనా, సంక్రాంతి, టీకాల కార్యక్రమాలు, సెలవులు మొదలైన కారణాల వల్ల చాలా మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేకపోయారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31గా ఉన్న గడువును ఫిబ్రవరి 21 వరకు పెంచాలని విజ్ఞప్తిచేశారు. రూ.10 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి సాధ్యమైన మేరకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందుకు విద్యానగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మార్పీఎస్‌ నేతలు మీడియాతో మాట్లాడారు. దళితులకు బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వడంతోపాటు సబ్‌ప్లాన్‌ నిధులు దారిమళ్లకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.


VIDEOS

logo