సెమీస్‌కు సాత్విక్ జోడీ
థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీస్ చేరింది. కానీ సింగిల్స్ విభాగాల్లో భారత్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు.
- క్వార్టర్స్‌లోనే సింధు నిష్క్రమణ
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీస్ చేరింది. కానీ సింగిల్స్ విభాగాల్లో భారత్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో భారత ఆశలు మోస్తున్న లక్ష్యసేన్, పీవీ సింధు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్ ద్వయం.. 21-12, 21-13తో జపాన్ షట్లర్లు టకుమి నొముర, యుచి షిమొగమిపై అలవోకగా గెలిచారు. జపాన్ జోడీతో తొలిసారి తలపడ్డ భారత జంట.. పెద్దగా కష్టపడకుండానే రెండు గేమ్స్‌లోనూ ప్రత్యర్థులను 41 నిమిషాల్లోనే చిత్తుచేసి లాస్ట్-4 స్టేజ్‌కు అర్హత సాధించింది.
కాగా మహిళల క్వార్టర్స్‌లో సింధు.. 21-19, 18-21, 15-21తో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యమగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. సుమారు గంటపాటు సాగిన హోరాహోరీ పోరులో తొలి గేమ్‌ను గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో తడబడటంతో జపాన్ అమ్మాయి గేమ్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభంలోనే 0-5తో వెనుకబడ్డ సింధు.. ఆ తర్వాత పుంజుకుని 11-12కు చేరినా ఆఖర్లో గేర్ మార్చిన యమగుచి భారత అమ్మాయికి అవకాశమివ్వకుండా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. మెన్స్ సింగిల్స్‌లో లక్ష్య.. 19-21, 16-21తో వితిద్సరన్ చేతిలో ఓడిపోవడంతో సింగిల్స్ విభాగంలో భారత్ కథ ముగిసినైట్టెంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Commission | సీఎం కమీషన్ 15%.. టెండర్లు, బిల్లుల చెల్లింపులో విచ్చలవిడి అవినీతి
KTR | విదేశీ బొగ్గులో.. 3 వేల కోట్ల సామ్.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ!
Revanth Reddy | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 16-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
మహా విపత్తు… ముంచుకొస్తున్న నీటి ముప్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

