ఢిల్లీ : మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10కు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ముగిసిన బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో నిలకడగా ఆడుతున్న (ఇండియా, సింగపూర్, చైనా ఓపెన్లలో సెమీస్) సాత్విక్ జోడీ.. మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ స్థానానికి చేరింది.
పురుషుల సింగిల్స్‌లో భారత నెంబర్ వన్ ఆటగాడు లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 17వ స్థానానికి చేరుకోగా హెచ్ఎస్ ప్రణయ్ 33వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుకు వరుస ఓటములు ఎదురవుతున్నా ఆమె 15వ స్థానంలోనే కొనసాగుతున్నది. చెన్నై ఓపెన్‌లో ఆమెకు షాకిచ్చిన ఉన్నతి.. కెరీర్ బెస్ట్ ర్యాంకు (31)కు చేరుకుంది. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ జంట 11వ స్థానంలో కొనసాగుతున్నది.