కౌలాలంపూర్: మలేషియా ఓపెన్‌లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ సెమీఫైనల్స్‌కు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో యీ సిన్ ఓంగ్-ఇ యి టియోను చిత్తుచేసింది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ తొలి గేమ్‌లో ఇరు జట్ల షట్లర్లు హోరాహోరీగా పోరాడారు.
మొదటి గేమ్ విరామానికి ముందు 11-9తో స్వల్ప ఆధిక్యంలో ఉన్న భారత ద్వయం దానిని 20-19కు తీసుకెళ్లింది. ఆ తర్వాత వరుసగా 4 పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థికి పోరాడే అవకాశం ఇవ్వకుండా జోరు పెంచి వరుసగా మూడోసారి సెమీస్‌కు చేరింది.