బెంగుళూరు: సర్ఫారాజ్ ఖాన్(Sarfaraz Khan) టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. బెంగుళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్ పవర్ ప్రదర్శించాడు. రకరకాల పంచ్, పవర్ స్ట్రోక్స్‌తో కివీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. ఘోరమైన పరాభవం తప్పదు అనుకున్న దశలో.. సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగాడు. నిజానికి మ్యాచ్‌పై కివీస్‌కే పట్టు ఉన్నా.. సర్ఫరాజ్ మాత్రం నాలుగవ రోజు సెంచరీ నమోదు చేశాడు. 11 బంతుల్లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో సర్ఫరాజ్ తన సెంచరీ చేశాడు.
Maiden Test 💯! 👏 👏
What a cracker of a knock this is from Sarfaraz Khan! ⚡️⚡️
Live ▶️ https://t.co/8qhNBrrtDF#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/UTFlUCJOuZ
— BCCI (@BCCI) October 19, 2024
కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్న కివీస్‌ను.. తన స్ట్రోక్ ప్లేతో సర్ఫరాజ్ నిలువరించాడు. ఫీల్డర్ల మీద నుంచి షాట్లు కొడుతూ.. కివీస్ ఫీల్డర్లను వత్తిడిలోకి నెట్టేశాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా మూడు వికెట్ల నష్టానికి 280 రన్స్ చేసింది. సర్ఫరాజ్ 106, పంత్ 11 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 76 పరుగులు వెనుకబడి ఉంది.