Sanju Samson | బెంగళూరు : ఐపీఎల్-18లో తొలి మూడు మ్యాచ్‌లకు స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే కొనసాగిన సంజూ శాంసన్.. తిరిగి రాజస్థాన్ రాయల్స్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. కుడిచేతి చూపుడు వేలికి గాయం కారణంగా రెండు వారాల పాటు వికెట్ కీపింగ్ చేయొద్దని బీసీసీఐ అతడికి సూచించిన నేపథ్యంలో గత మూడు మ్యాచ్‌లలో సంజూ కీపర్‌గానే గాక సారథ్య బాధ్యతలకూ దూరంగా ఉన్నాడు. దీంతో రియాన్ పరాగ్ రాజస్థాన్‌ను నడిపించాడు. తాజాగా సంజూకు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి క్లియరెన్స్ లభించడంతో అతడు ఈనెల 5న పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌తో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు.