Team India | విజయంతో ముగించారు.. జింబాబ్వేకు చుక్కలు చూపించింన యువ భారత్
సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వేకు వెళ్లిన యువ భారత జట్టు ఈ పర్యటనను విజయంతో ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లోనే అనూహ్య ఓటమి ఎదురైనా తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది.
- ఐదో టీ20లోనూ భారత్ గెలుపు
- సిరీస్ 4-1తో కైవసం
- రాణించిన శాంసన్, ముకేశ్
సీనియర్ల గైర్హాజరీలో జింబాబ్వేకు వెళ్లిన యువ భారత జట్టు ఈ పర్యటనను విజయంతో ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లోనే అనూహ్య ఓటమి ఎదురైనా తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లలోనూ ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి టీ20లో భారత్ బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా బంతితో మాత్రం రెచ్చిపోయి సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. బ్యాట్‌తో సంజూ శాంసన్, బంతితో ముకేశ్ కుమార్ రాణించారు.
Team India | హరారే: జింబాబ్వే పర్యటనలో యువ భారత జట్టు అదరగొట్టింది. ఆదివారం ఆతిథ్య జట్టుతో జరిగిన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58, 1 ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబె (12 బంతుల్లో 26, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. మోస్తరు లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకే చాప చుట్టేసింది. డియోన్ మైర్స్ (32 బంతుల్లో 34, 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (4/22), దూబె (2/25) ధాటికి జింబాబ్వే బ్యాటర్లు తోకముడిచారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న దూబెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా సిరీస్ ఆసాంతం రాణించిన వాషింగ్టన్ సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించింది.
ఆదుకున్న శాంసన్ : టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. భారత ఇన్నింగ్స్‌లో తొలి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచిన జైస్వాల్ (12).. రజా వేసిన నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. వేగంగా ఆడిన అభిషేక్ (14), శుభ్‌మన్ గిల్ (13) సైతం విఫలమవడంతో భారత్ 40 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది. ఈ క్రమంలో శాంసన్, రియాన్ పరాగ్ (22) భారత్‌ను ఆదుకున్నారు. ఇద్దరూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయడమే గాక స్కోరుబోర్డునూ ముందుకు నడిపించారు. జింబాబ్వే బౌలర్లు కట్టడిచేయడంతో మధ్య ఓవర్లలో పరుగుల రాక మందగించినా వీలుచిక్కినప్పుడల్లా శాంసన్ సిక్సర్లు బాదాడు. మవుట 15వ ఓవర్లో పరాగ్ నిష్క్రమించడంతో 65 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధ సెంచరీ పూర్తిచేశాక శాంసన్‌ను ముజరబని ఔట్ చేశాడు. క్రీజులోకి రాగానే మూడో బంతికి సిక్స్ బాదిన దూబె ఎంగర్వ 19వ ఓవర్లో 4,6,4 తో భారత స్కోరును 150 మార్కు దాటించాడు.
ముకేశ్ పేస్‌కు విలవిల : ఛేదనలో జింబాబ్వేను ముకేశ్ వణికించాడు. తొలి ఓవర్లో మూడో బంతికే ఓపెనర్ వెస్లీని బౌల్డ్ చేసిన అతడు.. మూడో ఓవర్లో బెన్నెట్ (10)ను ఔట్ చేశాడు. 5 ఫోర్లతో జోరుమీదున్న మరుమని (27) వాషింగ్టన్ సుందర్ 9వ ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. డియోన్నును పెవిలియన్ కు పంపిన దూబె.. అద్భుత త్రో తో రజా (8)ను రనౌట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన జింబాబ్వే బ్యాటర్లలో ఫరజ్ అక్రమ్ (13 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడేందుకు ప్రయత్నించినా ముకేశ్ 19వ ఓవర్లో అతడి ఆట కట్టించడంతో ఆతిథ్య జట్టు ఓటమి ఖరారైంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 20 ఓవర్లలో 167/6 (సంజూ 58, దూబె 26, ముజరబని 2/19, రజా 1/37).
జింబాబ్వే: 18.3 ఓవర్లలో 125 ఆలౌట్ (డియోన్ 34, అక్రమ్ 27, ముకేశ్ 4/22, దూబె 2/25)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

