ఢిల్లీ: ఇటీవల పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌పై వేటు పడింది. ఈనెల 23 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టులో అతడు చోటు కోల్పోయాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌కు ఆడుతున్న జట్టులో ఉన్న సంజూపై వేటు పడగా అక్షర్ పటేల్, వాషింగ్టన్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఐపీఎల్లో రాణించిన అశోక్ శర్మ, యశ్ ఠాకూర్‌కు జట్టులో తొలిసారి చోటు దక్కింది. రింకూ సింగ్, యూపీ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ తిరిగి టీమ్‌లోకి రాగా ఐపీఎల్లో నిలకడగా రాణించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ సైతం ఎంపికయ్యాడు.
భారత జట్టు:
శ్రేయస్ (కెప్టెన్), వైభవ్, అభిషేక్, తిలక్, ఇషాన్, దూబే, సూర్యాంశ్, రింకూ, హర్ష్ దూబే, చక్రవర్తి, ప్రిన్స్, యశ్, అశోక్, మయాంక్, ప్రభ్‌సిమ్రన్.