IPL 2024 : ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. పవర్ హిట్టర్లకు కేరాఫ్ అయిన ఈ మెగా టోర్నీలో రికార్డుల వీరులకు కొదవే లేదు. ఇక రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) విషయానికొస్తే అతడికి ఐపీఎల్లో గొప్ప రికార్డే ఉంది. అలవోకగా భారీ సిక్సర్లు బాదే శాంసన్ గత ఐదేండ్లుగా తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కొడుతూ వస్తున్నాడు. తాజాగా 17వ సీజన్ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై ఈ డాషింగ్ బ్యాటర్ అర్ధ శతకంతో చెలరేగాడు.
తద్వారా వరుసగా ఐదు సీజన్ల తొలి మ్యాచ్‌లో సంజూ యాభైకి తగ్గకుండా స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సిక్సర్ల వీరుడిగా పేరొందిన శాంసన్ ఐపీఎల్ 2020 ఎడిషన్ నుంచి ఫస్ట్ మ్యాచ్‌లో కనీసం హాఫ్ సెంచరీ బాదేస్తున్నాడు. 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సంజూ 34 బంతుల్లోనే 74 రన్స్ కొట్టాడు. 2021లో పంజాబ్ కింగ్స్‌పై ఏకంగా సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ పవర్ హిట్టర్ 63 బంతుల్లోనే 119 రన్స్ కొట్టేశాడు.
Fine Hitting On Display 💥
Sanju Samson brings up his 5️⃣0️⃣#RR 119/2 after 13 overs
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱
Follow the match ▶️ https://t.co/MBxM7IvOM8#TATAIPL | #RRvLSG pic.twitter.com/MTywnipKwl
— IndianPremierLeague (@IPL) March 24, 2024
అనంతరం ఐపీఎల్ 15వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)పై శాంసన్ తన తడాఖా చూపించాడు. కేవలం 27 బంతుల్లోనే 55 పరుగులు బాదాడు. 16వ సీజన్లో మళ్లీ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో (55) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అంతేకాదు టీ20ల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధికంగా 23 ఫిఫ్టీలు బాదిన మూడో ఆటగాడిగా శాంసన్ మరో రికార్డు సృష్టించాడు. జోస్ బట్లర్ 23, అజింక్యా రహానే 23 అర్ధ శతకాలతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.