New York-Theiefs | అమెజాన్ వర్కర్నంటూ వచ్చి.. రూ.29 లక్షల ఆభరణాలు దోచుకెళ్లాడు..!
New York-Theiefs | అమెరికాలోని న్యూయార్క్, సబర్బన్ ప్రాంతాల్లో దొంగలు అమెజాన్ వర్కర్లమంటూ ఇండ్లలోకి చొరబడి విలువైన వస్తువులు దోచుకెళ్తన్నారు.
New York-Theiefs | అమెజాన్ వర్కర్నంటూ ఓ వ్యక్తి ఇండ్లు, అపార్ట్మెంట్లలో చొరబడి బంగారం ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు దొంగిలిస్తున్నాడు. ఈ ఘటనలు న్యూయార్క్ పొరుగున ఉన్న ఆస్టోరియా, సన్నీసైడ్ ప్రాంతాల్లోని తొమ్మిదికి పైగా అపార్ట్మెంట్లలో చొరబడి లండన్ క్యాష్ తోపాటు రూ.29 లక్షల విలువైన బంగారం ఆభరణాలు దోచుకెళ్లాడని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆ వ్యక్తిపై తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
సదరు వ్యక్తి అమెజాన్ వర్కర్నంటూ ఇండ్లలోకి వచ్చి అక్కడి పరిసరాలు అన్నీ చూస్తాడు. తదుపరి ఇంట్లోకి చొరబడి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్తాడు. సన్నీ సైడ్ ప్రాంత నివాసి ఎస్ర్లా ఇస్లాస్ అనే బాధితురాలు మాట్లాడుతూ.. సదరు వ్యక్తి తమ బాత్ రూమ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి.. 9000 డాలర్లు (రూ.7.5 లక్షలు) దోచుకెళ్లాడని తెలిపింది. తన 12 ఏండ్ల కూతురు భవిష్యత్ కోసం పొదుపు చేసిన సొమ్ము దోచుకెళ్లాడని ఆరోపించింది. గత జనవరి నుంచి సదరు వ్యక్తి ఈ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ నెల ఐదో తేదీన సన్నీసైడ్ ప్రాంతంలోని స్కిల్ మ్యాన్ ఎవెన్యూలో గల ఇంటి కిటికి బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు ఆ దొంగ. ఆ ఇంట్లో 6,500 డాలర్ల (రూ.5.4 లక్షలు) విలువైన బంగారం ఆభరణాలు, రూ.16 వేల క్యాష్ (200 డాలర్లు) దోచుకెళ్లాడు. న్యూయార్క్ సిటీ సబర్బన్ ప్రాంతం న్యూ బర్గ్ లోని ఇంట్లోకి ఈ నెల రెండో తేదీన సాయుధ దొంగల ముఠా ఎంటరై ఆ ఇంటి కుటుంబ సభ్యులు చూస్తుండగానే మనీ దోచుకెళ్లింది.
అమెజాన్ వర్కర్ నంటూ ఓ వ్యక్తి తలుపు కొడతాడు. ఇంటి యజమాని తలుపు తీయగానే సంతకం చేయమని అంటాడు. ఈ లోపు తుపాకీ గురి పెడతాడు. అతడితోపాటు వచ్చిన ముగ్గురు దొంగలు.. ఇంట్లో వారందరిని ఒకే చోట కూర్చుండబెట్టి విలువైన వస్తువులు, నగదు తీసుకుని, ఇంటికి తాళం వేసి పారిపోతున్నారని వార్తలొచ్చాయి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

