Sanju Samson | ముంబయిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ గాయపడ్డాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి తగలడంతో టీమిండియా వికెట్ కీపర్ చూపుడువేలుకు తీవ్రంగా గాయమైంది. ఈక్రమంలో నెల రోజులకుపైగానే క్రికెట్‌కు దూరమయ్యేఅవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌కు సైతం అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తున్నది. అదే సమయంలో ఐపీఎల్ ప్రారంభంలో పలు మ్యాచులు ఆడడం కూడా సందేహాస్పదంగా మారింది. మీడియా నివేదికల ప్రకారం.. గాయం కారణంగా సంజూ స్వస్థలమైన తిరువనంతపురానికి చేరుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో శిబిరంలో పాల్గొంటాడు. ఎన్సీఏ ఆమోదం తెలిపితేనే మళ్లీ క్రికెట్ ఆడేందుకు అవకాశం ఉంటుంది.
ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ కుడి చూపుడు వేలులో ఫ్రాక్చర్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు కనీసం ఐదు నుంచి ఆరువారాల సమయం పడుతుందని.. దాంతో ఫిబ్రవరి 8-12 మధ్య పుణేలో జరిగే కేరళ తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నది. ఫైనల్ మ్యాచ్ మే 2025న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్నది. ప్రారంభం కానుంది, ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్నది. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఐదు మ్యాచుల్లో 10.20 సగటు, 127.58 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 51 పరుగులు చేశాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అవగా.. నాల్గో మ్యాచ్‌లో సాకిబ్, ఐదో మ్యాచ్‌లో మార్క్‌వుడ్ అవుట్ చేశాడు.