Sanju Samson : పొట్టి క్రికెట్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న సంజూ శాంసన్ (Sanju Samson) రికార్డుల మోత మోగించాడు. అహ్మదాబాద్ టీ20లో ఓపెనర్‌గా ఉన్నంత సేపు దంచేసిన సంజూ.. అంతర్జాతీయంగా వెయ్యి పరుగుల క్లబ్లో చేరాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా 1,000 రన్స్ పూర్తి చేసుకున్న నాలుగో బ్యాటర్‌గా నిలిచాడీ రైట్ హ్యాండర్. 679 బంతుల్లోనే ఈ మైలురాయికి చేరుకున్న సంజూ మాజీ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) రికార్డు సమం చేశాడు.
తనకెంతో అచ్చొచ్చిన టీ20ల్లో ఉతికారేసే సంజూ శాంసన్ ఒకేదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు రికార్డులు పట్టేశాడు. అంతర్జాతీయంగా వెయ్యి రన్స్ చేసిన అతడు.. దేశవాళీ, ఐపీఎల్, అంతర్జాతీయ టీ20ల్లో కలిపి 8వేల రన్స్ సాధించాడు. ఇక బంతుల విషయానికొస్తే అభిషేక్ శర్మ 528తో టాప్‌లో ఉన్నాడు. 573 బంతుల్లో థౌజండ్వాలాగా అవతరించిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతుండా.. హార్దిక్ పాండ్యా, శాంసన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. కేఎల్ రాహుల్(686 బంతుల్లో), తిలక్ వర్మ(690 బంతుల్లో) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Milestone Unlocked 🔓
1⃣0⃣0⃣0⃣ T20I runs and counting for Sanju Samson 🙌
Updates ▶️ https://t.co/kw4LKLNSl3#TeamIndia | #INDvSA | @IamSanjuSamson | @IDFCFIRSTBank pic.twitter.com/ObpLtOGjXb
— BCCI (@BCCI) December 19, 2025