IPL 2024 SRH vs GT : ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ స్కోర్‌తో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad)కు షాక్ తగిలింది. సొంతమైదానంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జోరుముందు కమిన్స్ సేన నిలవలేకపోయింది. బ్యాటర్లు పోరాడగలిగే స్కోర్ అందించినా పసలేని బౌలింగ్‌తో ఆరెంజ్ ఆర్మీ రెండో ఓటమి మూటగట్టుకుంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిన గుజరాత్ ఆదివారం జులు విదిల్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్(45), డేవిడ్ మిల్లర్(44 నాటౌట్), శుభ్‌మన్ గిల్(36)లు కీలక ఇన్నింగ్స్ ఆడగా.. విజయ్ శంకర్(14 నాటౌట్) సుడిగాలిలా విరుచుకుపడ్డాడు. దాంతో, గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
Taking a bowler on in some style! 👊
Watch how Sai Sudharsan and David Miller went big off Mayank Markande 🎥 🔽
Head to @JioCinema & @StarSportsIndia to watch the match LIVE 💻📱
Follow the match ▶️ https://t.co/hdUWPFsHP8 #TATAIPL | #GTvSRH | @gujarat_titans | @sais_1509… pic.twitter.com/BsUdC2CdI3
— IndianPremierLeague (@IPL) March 31, 2024
సన్‌రైజర్స్ నిర్దేశించిన 162 పరుగుల ఛేదనలో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(36), వృద్దిమన్ సాహాలు(25)లు ధనాధన్ ఆడారు. అచ్చొచ్చిన మైదానంలో గిల్ మరింత ప్రమాదకరంగా కనిపించాడు. ఇద్దరూ తొలి వికెట్‌కు 36 పరుగులు జోడించారు. ఆ తర్వాత కాసేపటికే గిల్‌ను మయాంక్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ తన బ్యాటింగ్ షోతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడు. విధ్వంసక హిట్టర్ మిల్లర్‌తో కలిసి 50 ప్లస్ స్కోర్ చేశాడు. సుదర్వన్ వెనుదిరిగాక వచ్చిన విజయ్ శంకర్, మిల్లర్‌తో కలిసి లాంఛనం ముగించాడు.
Skills 🫡
Discipline 🫡2️⃣ in 2️⃣ for Mohit Sharma as he keeps the #SRH innings under check✅
Head to @JioCinema & @StarSportsIndia to watch the match LIVE 💻📱
Follow the match ▶️ https://t.co/hdUWPFsHP8#TATAIPL | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/dVj6ImFB93
— IndianPremierLeague (@IPL) March 31, 2024
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 34 పరుగులకే మయాంక్(16) ఔటైనా.. అభిషేక్ జతగా హెడ్(19) దంచాడు. దాంతో, పవర్ ప్లేలోనే కమిన్స్ సేన వికెట్ నష్టానికి 56 రన్స్ చేసింది. ఆ తర్వాత నూర్ అహ్మద్ సూపర్ డెలివరీతో హెడ్‌ను బౌల్డ్ చేశాడు. అక్కడితో వికెట్ల పతనం మొదలైంది. కమిన్స్ సేనకు షాక్ తగిలింది. విధ్వంసక ఆటగాళ్లు అభిషేక్ శర్మ(28), మర్క్రమ్(17), క్లాసెన్(24)లు భారీ స్కోర్ చేయలేకపోయారు. చివర్లో కుర్రాళ్లు అబ్దుల్ సమద్(29 నాటౌట్), షహ్బాజ్ అహ్మద్(22)లు విరుచుకుపడడంతో హైదరాబాద్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు పడగొట్టాడు.