బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 14, 2020 , 01:49:53

అసోంలో దవాఖానకు సచిన్‌ సాయం

 అసోంలో దవాఖానకు సచిన్‌ సాయం

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ మరోమారు తన ఉదారతను చాటుకున్నాడు. అసోం రాష్ట్రం కరీంగంజ్‌ జిల్లాలోని మకుందా దవాఖానకు వైద్య పరికరాలను అందజేశాడు. దీని ద్వారా దాదాపు రెండు వేల మందికి పైగా పేద చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ప్రస్తుతం యునిసెఫ్‌ గుడ్‌విల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సచిన్‌ అందించిన సాయానికి మకుందా హాస్పిటల్‌ పిల్లల వైద్యుడు విజయ్‌ ఆనంద్‌ కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని గిరిజన జాతికి చెందిన కుటుంబాలకు పోషక విలువలతో కూడిన ఆహారంతో పాటు విద్యను తన ఫౌండేషన్‌ ద్వారా సచిన్‌ అందిస్తున్నాడు. ఈశాన్య రాష్ర్టాల్లోనూ నిరాదరణకు గురైన జాతులను ఆదుకునేందుకు మాస్టర్‌ ముందుకొచ్చాడు.